అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala Congress | లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
నటిని వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కేరళ కాంగ్రెస్(Kerala Congress)యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్(MLA Rahul Mamkootathil) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా తిరగక ముందే అతనిపై మరోసారి లైంగిక ఆరోపణలు వచ్చాయి. తనకు తరచూ అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పని చేసే మహిళా కార్యకర్త అవంతిక(Women Activist Avantika) తెలిపారు. తన లైంగిక కోరికలు, రేప్ ఫాంటసీలకు సంబంధించిన విషయాలను మెసేజ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని, దీనిపై కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె వెల్లడించారు.
ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకుడు తనతో దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని మలయాళ నటుడు రిని జార్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఎవరో పేరు చెప్పనప్పటికీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మమ్‌కూటథిల్ పాత్రను ఆరోపించింది. దీంతో ఆయన ఆరోపణలను ఖండిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై మరోసారి లైంగిక ఆరోపణలు వచ్చాయి. “త్రిక్కకర ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత, సోషల్ మీడియా ద్వారా మంచి స్నేహితులమయ్యాము. మొదట్లో, అతను రాత్రి 11 గంటల తర్వాత నాకు ఫోన్ చేసేవాడు. తరువాత, నిరంతరం కాల్ చేయడం ప్రారంభించాడు. తర్వాత తరచూ అసభ్యకర మెసేజ్‌లు పంపేవాడు. ఒకసారి, అత్యాచారాన్ని పోలి ఉండేలా నాతో సెక్స్‌లో పాల్గొనాలనే తన కోరిక గురించి కూడా అతను బయటపెట్టాడు. దీనిపై కాంగ్రెస్ నాయకులను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అత్యాచారం గురించి ఊహించిన వ్యక్తి సమాజంలో ఎలా రోల్ మోడల్ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అయితే.” అని అవంతిక వివరించారు.