HomeజాతీయంDigital Transactions | డిజిటల్‌ లావాదేవీలకు మరింత భద్రత.. డొమైన్‌లను మార్చిన బ్యాంకులు

Digital Transactions | డిజిటల్‌ లావాదేవీలకు మరింత భద్రత.. డొమైన్‌లను మార్చిన బ్యాంకులు

సైబర్‌ మోసాలను తగ్గించేందుకు, డిజిటల్‌ లావాదేవీలకు మరింత భద్రత కల్పించేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు తమ డొమైన్‌ పేరులో మార్పులు చేశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Digital Transactions | ఆర్‌బీఐ(RBI) ఆదేశాల మేరకు బ్యాంకులు తమ డొమైన్‌ పేరును మార్పు చేశాయి. సైబర్‌ మోసాలను తగ్గించేందుకు, డిజిటల్‌ లావాదేవీలకు (Digital Transactions) మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా పలు బ్యాంకులు తమ నెట్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైట్ల డొమైన్‌ (Website Domain) మార్చుకున్నాయి. .bank.in కు మారాయి. డిజిటల్‌ లావాదేవీలకు మరింత భద్రత కల్పించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సైబర్‌ మోసాలను తగ్గించేందుకు బ్యాంకులు ప్రస్తుత వెబ్‌సైట్‌ అడ్రస్‌లను .bank.in కు మార్చుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 21న ఆదేశించింది. దీనికి అక్టోబర్‌ 31వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఫిషింగ్‌, హ్యాకింగ్‌ వంటి సైబర్‌ నేరాలను (Cyber Frauds) తగ్గించి, సురక్షిత ఆర్థిక సేవలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలన్నది తమ లక్ష్యమని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో బ్యాంకులు స్పందించి ఆ దిశగా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతో (పీఎన్‌బీ) పాటు ప్రైవేట్‌ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా వంటివి కొత్త డొమైన్‌కు మారాయి.

బ్యాంకుల కొత్త డొమైన్‌లు..

State Bank of India: https://sbi.bank.in

Canara Bank: https://www.canarabank.bank.in

Punjab National Bank: https://pnb.bank.in/

ICICI Bank: https://www.icici.bank.in/

HDFC Bank: https://www.hdfc.bank.in/

Axis Bank: https://www.axis.bank.in/

Kotak Mahindra Bank: https://www.kotak.bank.in/en/home.html

Must Read
Related News