ePaper
More
    HomeజాతీయంReserve Bank of India | బ్యాంకు ఖాతాదారులకు మరింత భద్రత.. త్వరలోనే బీమా పరిమితి...

    Reserve Bank of India | బ్యాంకు ఖాతాదారులకు మరింత భద్రత.. త్వరలోనే బీమా పరిమితి పెంపు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Reserve Bank of India | బ్యాంకులలో సేవింగ్స్‌ ఖాతాలు(Savings account), టర్మ్‌ డిపాజిట్లు కలిగిన వారికి ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంటున్నాయి.

    డిపాజిట్ల(Deposits)పై బీమా పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. మన దేశంలో డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (Deposit Insurance and Credit Guarantee Corporation) అన్ని బ్యాంకులకు సంబంధించిన వివిధ రకాల డిపాజిట్లపై బీమా కవరేజీని అందిస్తోంది. ప్రస్తుతం సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌, కరెంట్‌, రికరింగ్‌ డిపాజిట్లపై గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా (Insurance) కవరేజీ ఉంది. అసలు, వడ్డీ రెండింటికి కలిపి ఈ బీమా వర్తిస్తుంది. దీనిని రూ.10 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

    Reserve Bank of India | డిపాజిట్లపై బీమా ఎందుకంటే..

    స్నేహితులకో, బంధువులకో, ఇతరులకో డబ్బులు ఇస్తే అవి తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. బ్యాంకు(Bank)లలో దాచుకుంటే ఎటూ పోవని ప్రజలు నమ్ముతారు. అయితే బ్యాంకులు దివాళా తీస్తే పరిస్థితి ఏమిటి? గతంలో పలు చిన్న సహకార బ్యాంకులు నిర్వహణ వైఫల్యాలతో దివాళా తీశాయి. ఆయా సందర్భాలలో డిపాజిటర్లు నష్టపోయారు. అటువంటి పరిస్థితులలో ఖాతాదారులకు రక్షణ కల్పించేందుకు డీఐసీజీసీ (DICGC) ఏర్పాటయ్యింది. డిపాజిట్లకు రక్షణ కల్పించేందుకు ఈ సంస్థ బ్యాంకుల నుంచి ప్రీమియం సేకరిస్తుంది. దివాళా తీసినా, ఆర్‌బీఐ(RBI) మారటోరియం విధించినా ఈ సంస్థ ఆయా బ్యాంకుల ఖాతాదారులకు రక్షణగా నిలిస్తోంది.

    Reserve Bank of India | 2020లో చివరిసారి పెంపు..

    దేశంలో బ్యాంకులపై నమ్మకం పెంచేందుకు, వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం 1962 లో చర్యలు చేపట్టింది. డీఏసీజీసీని ఏర్పాటు చేసింది. అప్పట్లో బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారుకు రూ.1,500 పరిహారం ఇచ్చేవారు. దీనిని 1976లో సవరించి రూ.20 వేలకు పెంచారు. ఆ తర్వాత 1980లో రూ. 30 వేలకు, 1993లో లక్ష రూపాయలకు పెంచారు. చివరి సారిగా 2002లో సవరించి బీమా పరిమితిని రూ. 5 లక్షలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ మొత్తం నామమాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (New India co-operative bank) కుంభకోణం తర్వాత డిపాజిట్లపై బీమా పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీమా పరిమితిని రూ. 5 లక్షలనుంచి రూ. 10 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే బ్యాంకింగ్‌(Banking) వ్యవస్థపై ప్రజలలో నమ్మకం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. తమ సొమ్ము సురక్షితంగా ఉంటుందని భావించినప్పుడు ప్రజలు బ్యాంకుల్లో దాచుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఒకవేళ బీమా పరిమితిని పెంచితే బ్యాంకులపై కొంత ఆర్థిక భారం పడుతుంది. కానీ బ్యాంకు భద్రతను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుంది.

    Reserve Bank of India | ఎన్ని రోజుల్లో పరిహారం అందుతుందంటే..

    బ్యాంకు దివాళా తీయడం వంటి కారణాలతో ఒక రుణదాత నష్టపోయినపుడు డిపాజిట్‌ బీమా క్లెయిమ్‌(Insurance claim) ప్రారంభమవుతుంది. బ్యాంకు దివాళా తీసినా, మారటోరియం పరిధిలోకి వెళ్లినా డిపాజిటర్‌కు 90 రోజుల్లోగా బీమా క్లెయిమ్‌ చెల్లిస్తారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...