అక్షరటుడే, ఎల్లారెడ్డి : Mla Madan Mohan | ఖాతాదారులు, రైతులకు మరింత సహకారం అందించేందుకు కో-ఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) అన్నారు.
Mla Madan Mohan | పంట రుణాలు అందించాలి
పట్టణంలో నిర్మించిన జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంక్ భవనాన్ని (Co-operative Bank) ఎమ్మెల్యే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌లో లక్ష్మి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. రైతులకు (Farmers) పంట రుణాలు సక్రమంగా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో పార్థసింహారెడ్డి, బ్యాంకు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అనంతరం ఎల్లారెడ్డి బస్టాండ్‌లో (Yellareddy Bus Stand) ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని హంగులతో బస్టాండ్‌ను నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పార్సిల్ సర్వీస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, పార్టీ మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
![]()
