అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uttar Pradesh | క్రికెట్ మైదానంలో హోరాహోరీగా సాగుతున్న ఆట ఒక్కసారిగా విషాదం నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ అహ్మర్ ఖాన్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు.
ఇది యూపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టోర్నమెంట్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనగా నిలిచింది. మొరాదాబాద్‌లోని బిలారి చక్కెర మిల్లు మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మొరాదాబాద్ మరియు సంభాల్ జట్లు తలపడాయి. మొరాదాబాద్(Moradabad) బ్యాటింగ్ చేసి లక్ష్యం నిర్దేశించగా, సంభాల్ జట్టు చేధనకు దిగింది.
Uttar Pradesh | గెలిపించి ఓడాడు..
చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమైన దశలో, ఎడమచేతి పేసర్ అహ్మర్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి, తన జట్టుకు 11 పరుగుల తేడాతో విజయం అందించాడు. విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో, అహ్మర్ ఖాన్ ఆఖరి బంతి వేసిన వెంటనే పిచ్ పై కూర్చొని, ఊపిరాడక తల్లడిల్లాడు. తోటి ఆటగాళ్లు మరియు వైద్య సిబ్బంది వెంటనే సీపీఆర్ అందించినా, పరిస్థితి మెరుగవ్వలేదు. వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను అప్పటికే గుండెపోటు(Heart Attack)తో మరణించాడని తెలిపారు.
దాంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌లో మునిగిపోయారు. గెలుపుతో ఆనందంలో మునిగిపోవాల్సిన జట్టు, సహచరుడి హఠాన్మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.. అహ్మర్ ఖాట అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయం సాధించిందనే విషయం వారి గుండెల్ని చిదిమేస్తుంది. మరణం ఎప్పుడు, ఎక్కడ వస్తుందో ఎవ్వరికీ తెలీదు అనేది ఈ సంఘటన మరోసారి నిరూపించింది.అహ్మర్ ఖాన్ కుటుంబానికి, స్నేహితులకు, సహచరులకు కష్టసమయంలో శాంతి చేకూరాలని ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా, ఈ మధ్య చాలా మంది చిన్న వయస్సులో గుండెపోటుతో మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అహ్మర్ ఖాన్‌కి ఎంతో భవిష్యత్ ఉండగా, ఇలా హఠాన్మరణం చెందడం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది.