అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | పట్టణంలోని భగలాముఖి పీఠంలో (Bagalamukhi Peetham) ఆదివారం అష్టమిని పురస్కరించుకుని భగలాముఖి అమ్మవారి (Goddess Bagalamukhi) మాస జన్మదిన అష్టమిని నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. చింతామణి గణపతి పూజతో పాటు గోత్రనామాలతో విశేష సంకల్పం నిర్వహించారు.
Yellareddy Mandal | శుద్ధోదక జలాభిషేకం
అమ్మవారి విగ్రహానికి శుద్ధోదక జలాభిషేకం, ఆవుపాలతో క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, పసుపుతో హరిద్రాభిషేకం, కొబ్బరి నీళ్లతో నారికేల జలాభిషేకాలు చేశారు. అలాగే భక్తులు దేవీదేవతల నామ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన పట్టు వస్త్ర సమర్పణతో పాటు వివిధ రకాల ఫలాలు, స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి క్రాంతి పటేల్, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.