అక్షరటుడే, అమరావతి: Montha Storm | ఆంధ్రప్రదేశ్‌ను మొంథా తుపాను వణికిస్తోంది. కాకినాడ – మచిలీపట్నం మధ్య మొంథా తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాను కదలుతూ వచ్చింది.
విశాఖపట్నంకి 220 కి.మీ., మచిలీపట్నానికి కి.మీ., కాకినాడకి 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పూర్తిగా తీరం దాటడానికి ఇంకా 2 – 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతోంది. తుపాను ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురగాలులు వీస్తున్నాయి.
Montha Storm | హెచ్చరికలు జారీ..
తీర ప్రాంత ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మొంథా తీరందాటే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ పరిసరాల్లో గాలుల తీవ్రత ఎక్కువ ఉంది.
ముఖ్యంగా యానాం, కాకినాడ తీరప్రాంతాలకు ఉప్పెన ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖలో కొండచరియలు విరిగిపడ్డాయి.
