Vrindavan
Vrindavan | కోతి భ‌లే ప‌ని చేసిందిగా… రూ.20 లక్షల విలువైన నగల పర్సు ఎత్తుకెళ్లి..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vrindavan | ఈ మ‌ధ్య కోతుల సంఖ్య బాగా పెరిగింది. కోతులు బెడ‌ద ప‌ల్లెల్లోనే కాదు ప‌ట్ట‌ణాల‌లోనూ ఎక్కువే. అయితే కొన్ని కోతులు మ‌నుషుల‌పై దాడి చేయ‌డం, లేదంటే మ‌న చేతుల్లో ఉన్న‌వి ఎత్తుకెళ్ల‌డం వంటివి చేస్తున్నాయి. తాజాగా ఓ కోతి ఏకంగా రూ.20 ల‌క్ష‌ల విలువైన న‌గ‌ల ప‌ర్సు(Purse) ఎత్తుకెళ్లి కాసేపు భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్‌లో శుక్రవారం ఈ సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ సమీపంలో ఓ భక్తురాలి వద్ద నుంచి కోతి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న పర్సును లాక్కెళ్లింది.

2025 జూన్ 6న వృందావన్‌ నగరంలోని ప్రసిద్ధ ఠాకూర్ బాంకే బిహారీ ఆలయం(Thakur Banke Bihari Temple)కి యూపీలోని అలీఘర్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో ఆలయ దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఓ కోతి అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) భార్య చేతిలో ఉన్న పర్సును లాక్కెళ్లింది. ఆ పర్సులో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికుల సహకారంతో పరిసరాలను గాలించగా, కొన్ని గంటల వెతుకులాట త‌ర్వాత‌ సమీపంలోని ఓ పొదలో పర్సును గుర్తించారు.

అదృష్టవశాత్తూ, పర్సులోని ఆభరణాలు అన్నీ భద్రంగా ఉండ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులు(Police) వాటిని అభిషేక్ అగర్వాల్ కుటుంబానికి అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కోతుల వల్ల తలెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మొదట్లో శ్రీ రంగనాథ్ జీ మందిరం(Shri Ranganath Ji Temple) వద్ద ఓ భక్తుడి ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన నవ్వులు తెప్పించగా, తాజా సంఘటన మాత్రం భయానకమైన అనుభవంగా మిగిలింది. అయితే యూపీలోని వృందావ‌న్ గుడిలో ఓ వ్య‌క్తి చేతుల్లోంచి ఖ‌రీదైన ఐఫోన్(iPhone) ఎత్తుకెళ్లింది. శ్రీ రంగ‌నాథ్ జీ మందిర్ గోడ‌పై కూర్చున్న ఆ కోతి త‌న చేతుల్లోని ఫోన్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఇక ఆ కోతిని ఒప్పించేందుకు చాలా మంది చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. గోడ వ‌ద్ద గుమ్మికూడిన జ‌నం ఆ కోతి దిశ‌గా ఫ్రూటీలు విసిరారు. చివ‌ర‌కు ఓ ఫ్రూటీ ప్యాక్ అందుకున్న ఆ కోతి.. ఆ స‌మ‌యంలో త‌న చేతుల్లో ఉన్న ఫోన్‌ను వ‌దిలేసింది. కింద ఉన్న వ్య‌క్తి కోతి వ‌దిలిన ఐఫోన్‌ను చాక‌చ‌క్యంగా అందుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ఇన్‌స్టాలో పోస్టు చేయ‌గా, తెగ వైర‌ల్ అయ్యింది.