Homeబిజినెస్​Lalita Jewellery | "డబ్బులు ఐపీవో ద్వారా వస్తాయి".. పబ్లిక్‌ ఆఫర్‌కు లలితా జువెలరీ

Lalita Jewellery | “డబ్బులు ఐపీవో ద్వారా వస్తాయి”.. పబ్లిక్‌ ఆఫర్‌కు లలితా జువెలరీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Lalita Jewellery | “డబ్బులు ఎవరికీ ఊరికే రావు”.. యాడ్‌తో ‍ప్రాచుర్యం పొందిన ప్రముఖ జువెలరీ రిటైలర్ లలితా జ్యువెలరీ (Lalitha jewellery) మార్ట్ పబ్లిక్‌ ఆఫర్‌కు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

స్టాక్‌ మార్కెట్‌ (Stock market) నుంచి రూ.1,700 కోట్లు సమీకరించేందు కోసం సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌‌‌‌(DRHP)ను ఫైల్ చేసింది. వీటి ప్రకారం రూ.1,200 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్‌(ఓఎఫ్ఎస్‌‌‌‌) ద్వారా ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ (Fresh issue) నుంచి వచ్చే నిధులలో రూ.1,014.5 కోట్లను దేశంలో 12 కొత్త స్టోర్స్ (New stores) ఏర్పాటు చేయడానికి వినియోగిస్తామని, మిగతా మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ పేర్కొంది.

గతేడాది డిసెంబర్ 31 నాటికి.. దేశంలోని 46 పట్టణాలలో 56 స్టోర్లను కలిగి ఉన్నట్లు లలితా జువెలరీ డీఆర్‌హెచ్‌పీలో తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలలో స్టోర్లున్నాయని పేర్కొంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(Financial year)లో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు వివరించింది. ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరిందని తెలిపింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.12,594.7 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. రూ.262.3 కోట్ల లాభం (lalitha jewellery Profit) వచ్చిందని పేర్కొంది.