HomeUncategorizedBhupalapalli | భార్యకు తెలియకుండా డబ్బులు దాచిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Bhupalapalli | భార్యకు తెలియకుండా డబ్బులు దాచిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhupalapalli | భార్యాభర్తలు కష్టాసుఖాల్లో కలిసి మెలిసి ఉండాలి. అంతేగాకుండా కుటుంబానికి family సంబంధించిన అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకోవాలి. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

తాజాగా ఇలాంటి ఘటనే జయశంకర్​ భూపాలపల్లి Jayashankar Bhupalapalli జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం Ghanapuram mandalam గాంధీనగర్​కు చెందిన పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎడ్లను విక్రయించాడు. దీంతో రూ.1.50 లక్షలు రాగా.. ఆ డబ్బును ఇంట్లోని ధాన్యం సంచిలో దాచాడు. అయితే ఆ విషయాన్ని భార్యకు చెప్పలేదు.

గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడానికి ఇటీవల గ్రామానికి ఓ వ్యాపారి వచ్చాడు. దీంతో బస్తాతో సహా ధాన్యాన్ని వీరయ్య భార్య విక్రయించింది. అయితే కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన వీరయ్యకు ధాన్యం బస్తా కనిపించకపోవడంతో భార్యను అడిగాడు. దానిని అమ్మేసినట్లు ఆమె చెప్పింది. అందులో డబ్బు ఉందని చెప్పి.. సదరు వ్యాపారి కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో దంపతులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Bhupalapalli | దాపరికం సరికాదు

చాలా మంది భార్యాభర్తలు ఆర్థిక విషయాలు financial information పంచుకోరు. కొంతమంది భర్తలు తమ ఆర్థిక లావాదేవీల Financial transactions గురించి భార్యలకు అసలు చెప్పరు. ఎవరికైనా అప్పులు ఇచ్చినా.. ఎక్కడైనా పొదుపు చేసినా ఆ విషయాలు తమ వారికి చెప్పకుండా దాచిపెడతారు. దీంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ సొమ్ము అటే పోతోంది. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అలాగే పలువురు మహిళలు సైతం తమ భర్తలకు ఆర్థిక విషయాల గురించి చెప్పకుండా దాచిపెడతారు. దంపతులు ఇద్దరు ఆర్థిక విషయాల గురించి చర్చించాలని నిపుణులు సూచిస్తున్నారు. బీమాలు insurance, పొదుపు savings, పెట్టుబడులు, అప్పుల loans గురించి ఇంట్లో చర్చించాలని చెబుతున్నారు.