అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Monarch Surveyors IPO | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) ఒడిదుడుకుల్లో కొనసాగుతూ ఇన్వెస్టర్లకు నష్టాలు మిగులుస్తుండగా.. ఐపీవో(IPO)లు మాత్రం లాభాల పంట పండిస్తున్నాయి. మంగళవారం బీఎస్‌ఈలో లిస్టయిన మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఎస్‌ఎంఈ(SME) ఐపీవో భారీ లాభాలను అందించింది.
టోపోగ్రాఫిక్ సర్వేలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ సేవలు అందించే మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (Monarch Surveyors and Engineering Consultants) కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 93.75 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఒక లాట్‌లో 600 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్‌ల కోసం రూ. 3 లక్షలతో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు.
దీనికి భారీ స్పందన లభించింది. మొత్తం 250 సార్లకంటే ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ కోటా 263 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ(BSE)లో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేర్ ధర గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 250 కాగా.. 68.5 శాతం ప్రీమియం(Premium)తో లిస్టయ్యింది. అంటే ఒక్కో షేరుపై రూ. 171 లాభం వచ్చిందన్న మాట. ఐపీవో రూ. 3 లక్షలు పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయంలోనే రూ. 2.05 లక్షల లాభం వచ్చింది. అయితే లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను (Lower circuit) తాకి రూ.400.20 వద్ద నిలిచింది.