ePaper
More
    HomeసినిమాMonalisa | స్పెష‌ల్ సాంగ్‌తో ర‌చ్చ చేయ‌బోతున్న మోనాలిసా.. క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా

    Monalisa | స్పెష‌ల్ సాంగ్‌తో ర‌చ్చ చేయ‌బోతున్న మోనాలిసా.. క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Monalisa | మ‌హా కుంభ‌మేళాలో పూస‌ల దండ‌లు అమ్ముతూ యూట్యూబ‌ర్స్ దృష్టిలో ప‌డి సెల‌బ్రిటీ అయింది మోనాలిసా (Monalisa). ఒక్క వీడియోతో దేశ‌మంతా ఆమె ఫేమ‌స్ అయింది. దాంతో కుంభమేళాలో (kumbha mela) వైరల్ అయిన మోనాలిసాను చూసేందుకు అక్కడికి వెళ్లిన యూత్, భక్తులు, మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు (social media influencers) తెగ వెంటపడ్డారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు, ఇంటర్వ్యూలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ.. తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె వ్యాపారం తగ్గింది. మోనాలిసాను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు (family members) ఎప్పుడూ వెంట ఉండటంతో వాళ్ల వ్యాపారం కూడా తగ్గిపోయింది.

    Monalisa | సంద‌డే సంద‌డి…

    ఇదే స‌మ‌యంలో ఒక వ్య‌క్తి తాను ద‌ర్శ‌కుడిని (Director) అని చెప్పి మోనాలిసాతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. అయితే అతను మోసగాడని, సినిమా అవకాశాల పేరుతో మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని అత‌నిపై ఆరోప‌ణ‌లు రావ‌డం, పోలీస్ కేసు (police case) న‌మోదు కావ‌డం కూడా జ‌రిగింది. ఇటీవ‌ల మోనాలిసా షాప్ ఓపెనింగ్స్, స్పెష‌ల్ సాంగ్స్ (special songs), యాడ్స్ (adds) చేస్తూ బిజీ బిజీగా మారింది.తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో (Utkarsh Singh) కలిసి నటిస్తుంది. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ (acting classes) ద్వారా నైపుణ్యం సంపాదించిన మోనాలిసా స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి కాగా, మొత్తం పూర్త‌య్యాక యూట్యూబ్‌లో (youtube) విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

    READ ALSO  Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    తాజాగా మోనాలిసాకి (monalisa) సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ కాగా, ఈ పాట‌లో మోనాలిసా అందం, ఎక్స్‌ప్రెష‌న్స్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ కానున్నాయి. ఆమె న‌ట‌న‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న వారికి ఇది పండ‌గ‌లాంటి వార్తే అని అంటున్నారు. ఈ అమ్మ‌డు తేనెకళ్లు, డస్కీ స్కిన్, స్వచ్ఛమైన చిరునవ్వుతో యూత్‌ను మత్తెక్కిస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు మేక‌ర్స్ (Makers) మోనాలిసాతో సినిమాలు చేయాల‌ని ఉత్సాహ‌ప‌డుతున్నారు. టాలీవుడ్ ద‌ర్శ‌కులు (tollywood directors) కూడా మోనాలిసాని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి రానున్న రోజుల‌లో మోనాలిసా క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి.

    Latest articles

    Railway Passengers | ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. రిటర్న్ జర్నీ టికెట్​పై 20 శాతం తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని...

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ ​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు...

    More like this

    Railway Passengers | ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. రిటర్న్ జర్నీ టికెట్​పై 20 శాతం తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని...

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...