Homeక్రైంGujarat | సోష‌ల్ మీడియాలో బ్లాక్ చేసింద‌నే కోపం.. ప్రేయ‌సి గొంతు కోసిన ప్రియుడు

Gujarat | సోష‌ల్ మీడియాలో బ్లాక్ చేసింద‌నే కోపం.. ప్రేయ‌సి గొంతు కోసిన ప్రియుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gujarat | ప్రస్తుతం ప్రేమకు అర్థం మారిపోయినట్టే కనిపిస్తోంది. ప్రేమలో విఫలమైతే చంపడం లేదా చావడం అనే కోణంలో నేటి యువకులు ఆలోచిస్తున్న తీరు భయాందోళనలు కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రేమ విఫలమై యువతిని హత్య చేసిన యువకుడు, ప్రియుడి (Boyfriend) చేతిలో హత్యకు గురైన యువతి వంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.

తాజాగా గుజరాత్‌లోని భుజ్‌ పట్టణంలో (Bhuj town) చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన అందరినీ కుదిపేసింది. గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలోని కచ్‌ జిల్లా లో దారుణ‌ సంఘటన జరిగింది. గాంధీధామ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, భుజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ BCA కోర్సు చదువుతోంది. అదే కాలనీలో నివసించే మోహిత్ సిద్ధపారా (22) అనే యువకుడితో గతంలో ఆమెకు ప్రేమ సంబంధం ఉండేది. కానీ వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

Gujarat | మ‌రీ ఇంత దారుణ‌మా?

విడిపోవడంతో పాటు, తల్లి సూచన మేరకు యువతి మోహిత్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఇదే విషయం మోహిత్‌కి (Mohit Sidhapara) నచ్చలేదు. కోపంతో యువతి ఉన్న కళాశాల వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. సంస్కార్ పాఠశాల సమీపంలో, ఆమెను అడ్డగించి గొడవ పడ్డాడు. తనను బ్లాక్ చేసినందుకు కారణం అడిగాడు. తనపై ఇలాంటి ఒత్తిడి పెట్టొద్దని, ఇకపై కలవాలని ప్రయత్నించవద్దని ఆమె స్పష్టంగా చెప్పింది. దాంతో మోహిత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి దిగుతూ, గొంతు కోసి హత్య చేశాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన యువతి స్నేహితుడు కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. అనంతరం మోహిత్ అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించినా, ఆమె పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు (Police) నిందితుడు మోహిత్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణం కచ్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ప్రేమ Love పేరుతో ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయేలా జరిగిన ఈ హత్యపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు.. మోహిత్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News