HomeUncategorizedMohanlal | మోహ‌న్ లాల్‌కి ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Mohanlal | మోహ‌న్ లాల్‌కి ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Mohanlal | మలయాళ సినిమా (Malayalam cinema) దిగ్గజం, నాలుగు దశాబ్దాలుగా తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న మోహన్ లాల్‌కు (Mohanlal) భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును (Dadasaheb Phalke Award) ప్రకటించింది.

2023వ సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ విషయం శనివారం కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్ లాల్‌కు ఈ గౌరవాన్ని ప్రదానం చేయనున్నారు.

Mohanlal | చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలు

నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాతగా కూడా మోహన్ లాల్ భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ..మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినిమాకు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని కొనియాడింది. ఇప్పటి వరకు మోహన్ లాల్ అందుకున్న కొన్ని ప్రధాన గౌరవాలు చూస్తే మొత్తంగా 6 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా 2 సార్లు, స్పెషల్ జ్యూరీ అవార్డులు 4, పద్మశ్రీ (2001), పద్మ భూషణ్ (2019), వానప్రస్థం చిత్రానికి నిర్మాతగా బెస్ట్ ఫిల్మ్ అవార్డు, అనేక కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్  అవార్డులు (Film Fare Awards) అందుకున్నారు.

ఇక మోహన్ లాల్‌కు ఈ గౌరవం లభించడం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నేతలు, మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ విజయాన్ని ఘనంగా అభినందిస్తున్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఎపిక్ ‘వృషభ’ చిత్రంలో నటిస్తున్నారు. నంద్ కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 18, 2025న విడుద‌ల కానుంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ (Kannada) భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. భారతీయ సినీ చరిత్రలో అప్రతిహత ప్రయాణం చేసిన గొప్ప నటుడు మోహన్ లాల్. ఇప్పుడు ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం భారత సినిమాకు గర్వకారణం..

Must Read
Related News