అక్షరటుడే, వెబ్‌డెస్క్: Siraj Rakhi Celebration | టీమిండియా (Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు (Hyderabad player) మహమ్మద్ సిరాజ్ Siraj ఆటతోనే కాకుండా పర్సనల్ విషయాలతో కూడా నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాడు.
అయితే కొద్ది రోజులుగా ఆయన ఆశా భోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో డేటింగ్‌లో ఉన్నాడనే ప్రచారాలు సాగాయి. ఈ నేపథ్యంలో జనాయ్ భోస్లే.. మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు రాఖీ కట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సిరాజ్ స్వయంగా ఈ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఈ ఫెస్టివ్ మూమెంట్ మరింత స్పెషల్‌గా మారింది. సహచర ఆటగాడు రిషభ్ పంత్ కూడా లవ్ ఎమోజీతో స్పందించి తన శుభాకాంక్షలు తెలపడం విశేషం.
Siraj Rakhi Celebration | ఇలా క్లారిటీ ఇచ్చారు..
ఇదివరకూ సిరాజ్–జనాయ్ (Janai Bhosle) మధ్య డేటింగ్ Dating నడుస్తుందని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రాఖీ వేడుకతో ఆ పుకార్లకు క్లియర్ కట్ సమాధానం ఇచ్చారు. ఇది అన్నాచెల్లెళ్ల బంధం.. అనే సందేశాన్ని వారు ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చెప్పారు.
నిజంగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ వీరిద్దరినీ అభినందిస్తున్నారు. ఈ హ్యాపీ మూమెంట్‌లో ఇద్దరి మధ్య ఉన్న చెలిమి, అనుబంధం స్పష్టంగా కనిపించింది. జనాయ్ ఎంతో ప్రేమగా రాఖీ కడుతుండగా, సిరాజ్ ముచ్చటగా నవ్వుతూ ఆమెకు గిఫ్ట్ అందించాడు.
ఈ వీడియోతో ఇటీవల చక్కర్లు కొడుతున్న డేటింగ్ రూమర్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇది రొమాంటిక్ రిలేషన్ కాదని, నిజమైన అన్నాచెల్లెళ్ల బంధం అని వీరిద్దరూ ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ..“ఇదే నిజమైన అనుబంధం”, “ఎంతో ప్యూర్ రిలేషన్‌షిప్”, “సిరాజ్‌కి హ్యాట్సాఫ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇంగ్లండ్ England పర్యటనలో 23 వికెట్లు తీసి , సిరాజ్ తన కెరీర్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇప్పుడు టెస్ట్‌లలో జస్‌ప్రీత్ బుమ్రా పాత్ర పరిమితంగా ఉండడంతో, సిరాజ్ ఇండియన్ పేస్ అటాక్‌కు లీడర్ గా మారాడు. ఫిట్‌నెస్, ఫోకస్, ఫైర్ అన్నీ సమపాళ్లలో మిళితమై, ప్రతి మ్యాచ్‌లో అతని పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది.