అక్షరటుడే, వెబ్‌డెస్క్: Joe Root | ఓవల్ టెస్ట్ చివరి దశకు చేరుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్(England) విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం, భారత్‌కు మాత్రం 4 వికెట్లు కావాలి. మ్యాచ్ ఫలితం ఎటు వైపు తిరుగుతుంది అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఐదో రోజు ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంతి స్వింగ్, బౌన్స్‌తో విరుచుకుపడుతూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే, అదృష్టం ఇంగ్లండ్ పక్షాన ఉండడంతో కొంతవరకు తప్పించుకున్నారు. లేదంటే ఎక్కువ వికెట్లు కోల్పోయే పరిస్థితి ఉండేది.
Joe Root | ఫన్నీ కామెంట్స్..
నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత సిరాజ్‌పై జో రూట్ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. మహ్మద్ సిరాజ్ ఓ నిజమైన వారియర్. అతడి తత్వం, కష్టపడే తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అతడు జట్టులో ఉంటే ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉంటామో చెప్పలేం. వికెట్లు తీయడానికి పడే పట్టుదల, నిరంతరం నవ్వుతూ తన బాధ్యత నెరవేర్చే తత్వం – ఇవన్నీ యువ క్రికెటర్లకు ఆదర్శం,” అని కొనియాడాడు. అలాగే ఈ టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలవడం గమనార్హమని రూట్ పేర్కొన్నాడు. అదే సమయంలో సిరాజ్ దూకుడుపై రూట్ సరదా కామెంట్స్ చేశాడు. మైదానంలో కొన్నిసార్లు అతను దొంగ కోపాన్ని ప్రదర్శిస్తాడే కానీ అదంతా పైకి మాత్రమే. ఆ విషయాన్ని నేను గ్రహించాను. అతను చాలా మంచి వ్యక్తి. కాకపోతే మైదానంలో దూకుడుగా కనిపిస్తాడు అని రూట్ అన్నాడు.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (Harry Brook) ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ అందిపుచ్చుకున్నప్పటికీ, బంతిని పట్టుకొనే బౌండరీ లైన్ పట్టుకోవడంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో సిరాజ్ చూపిన అలుపెరుగని పోరాటం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక చివరి రోజు క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన వోక్స్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు, రెండో ఇన్నింగ్స్‌లోనైనా క్రీజులోకి వస్తాడా? అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన రూట్ అవసరమైతే తప్పకుండా బ్యాటింగ్‌కు వస్తాడు అని వివరించారు.