అక్షరటుడే, ఇందూరు: Bjp Morcha | పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి (BJP OBC Morcha State Spokesperson) స్వామి యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని 48వ డివిజన్లో బీడీ ప్యాకింగ్ (Beedi Packing) కార్మికులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతోమంది కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) 11 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ ఎల్లమ్మ తల్లి మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు భూపతి, రామచంద్ర, శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
