అక్షరటుడే, ఆర్మూర్:Modi Mann Ki Baat | ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వీక్షించి, ఆయన ఆలోచనలను అనుసరించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి నివాసంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకుడు పుప్పల శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పోశెట్టి, పోల్కం వేణు, ఉదయ్, ఆలూరు మండలాధ్యక్షుడు శ్రీకాంత్, తిరుపతి నాయక్, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, ప్రసన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
