ePaper
More
    HomeజాతీయంPM Modi | ప్రజలకు మోదీ గుడ్​న్యూస్​.. పన్నులు భారీగా తగ్గిస్తామని ప్రకటన

    PM Modi | ప్రజలకు మోదీ గుడ్​న్యూస్​.. పన్నులు భారీగా తగ్గిస్తామని ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | స్వాతంత్య్ర  దినోత్సవం (Independence Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు గుడ్​న్యూస్​ చెప్పారు. ఈ దీపావళీ ప్రజలకు బహుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు. జీఎస్టీ (GST)లో సంస్కరణలు తెస్తామన్నారు. సామాన్య ప్రజలు చెల్లించే పనుల్లో కోత పెడతామని ఆయన తెలిపారు. దీంతో వస్తువుల ధరలు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది ప్రధాని వెల్లడించారు.

    ప్రధాని మోదీ 79వ స్వాతంత్య్ర  వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఆయన జెండా ఎగుర వేసి మాట్లాడారు. ఈ దీపావళికి (Diwali) ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తామని ప్రకటించారు. కాగా దేశంలో గతంలో వివిధ రూపాల్లో పన్నులు ఉండగా.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకే దేశం ఒకే పన్ను ఉండాలని సంకల్పించింది. ఇందులో భాగంగా జీఎస్టీని తీసుకొచ్చింది. 2017 జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం వివిధ వస్తువులపై స్లాబుల ప్రకారం పన్నులు వేస్తున్నారు. పలు వస్తువులపై అధిక పన్ను ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని పన్నులు తగ్గిస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    PM Modi | ధరలు తగ్గుతాయా..

    దేశంలో 8 ఏళ్లలో జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు తెచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. తాజాగా కొత్తగా తెచ్చే సంస్కరణలపై రాష్ట్రాలతో కూడా మాట్లాడమాన్నారు. దీంతో సాధారణ, వ్యక్తిగత సేవలపై పన్ను తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్​ఎంఈ (MSME)లు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సాయ పడుతుందన్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 0శాతం, 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. అయితే కేంద్రం 12శాతం శ్లాబును రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో నెయ్యి, సబ్బులు, స్నాక్స్, గృహోపకరణాలు వంటి అనేక ముఖ్యమైన వస్తువులు 5శాతం పన్ను శ్లాబులోకి వస్తాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

    PM Modi | మిషన్​ సుదర్శన్​ చక్ర

    ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో భారతదేశం సాధించిన విజయాల గురించి మోదీ వివరించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. దేశ భద్రత కోసం మరింత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో కోసం మిషన్ సుదర్శన్ చక్ర (Mission Sudarshan Chakra) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

    PM Modi | పాక్​కు వార్నింగ్​

    ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి పాకిస్తాన్​కు (Pakistan) వార్నింగ్​ ఇచ్చారు. ఇటీవల ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్​లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సింధూ నదిపై (Sindhu River) ఆనకట్ట కడితే కూల్చేస్తామని పాక్​ ఆర్మీ చీఫ్​ అనగా.. సింధూ జలాల్లో ఒక చుక్కను కూడా వదులుకోమని ఆ దేశ ప్రధాని షరీఫ్​ అన్నారు. వారికి మోదీ కౌంటర్ ఇచ్చారు. సింధూ జలాలపై దాయాదీ దేశంతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని ఆయన అన్నారు. సింధూ జలాలను భారత భూ భాగానికి మళ్లించాలనే ఆలోచనలో మార్పు లేదన్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Kamareddy | పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదు: కోదండ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా పథకాల అమలులో ఎక్కడా రాజీ...

    Nani | పాపం ఈ హీరోకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి.. ముసుగు వేసుకొని వెళ్లి రెండు సినిమాలు చూశాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nani | నిన్న (ఆగస్ట్ 14) బాక్సాఫీస్‌ను ఊపేసిన రెండు భారీ సినిమాలు సూపర్...

    CM Revanth Reddy | తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం..: సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​...

    PM Modi | యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా...

    More like this

    Kamareddy | పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదు: కోదండ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా పథకాల అమలులో ఎక్కడా రాజీ...

    Nani | పాపం ఈ హీరోకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి.. ముసుగు వేసుకొని వెళ్లి రెండు సినిమాలు చూశాడా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nani | నిన్న (ఆగస్ట్ 14) బాక్సాఫీస్‌ను ఊపేసిన రెండు భారీ సినిమాలు సూపర్...

    CM Revanth Reddy | తెలంగాణ పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం..: సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్ర పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​...