అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Stations | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని మూడు రైల్వే స్టేషన్లనున గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం central govt రైల్వే స్టేషన్ల railway stations ఆధునికీకరణకు అనేక నిధులు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన హైదరాబాద్‌లోని బేగంపేట begumpet railway station, కరీంనగర్ karimnagar railway station, వరంగల్ warangal railway station రైల్వేస్టేషన్లను ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi వర్చువల్‌గా పున:ప్రారంభించనున్నారు.
Railway Stations | ఆధునిక వసతులతో..
రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. బేగంపేట స్టేషన్‌ను రూ.26.55 కోట్లు, కరీంనగర్ 25.85 కోట్లు, వరంగల్ రైల్వే స్టేషన్‌ను 25.41 కోట్లతో ఆధునీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని బేగంపేట స్టేషన్లో ఎయిర్‌పోర్టు మాదిరి సౌకర్యాలు కల్పించారు. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొదటి పూర్తి మహిళా నిర్వహణ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ప్రధాని మోదీ స్టేషన్లను ప్రారంభించనున్న దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Railway Stations | లిఫ్ట్‌లు.. ఎస్కలేటర్లు
అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్స్ ac waiting halls నిర్మించారు. రైల్వే స్టేషన్ మొత్తం సీసీ కెమెరాలు అమర్చారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వరంగల్‌లో సైతం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారు.
