HomeతెలంగాణRailway Stations | ఆధునిక హంగులతో సిద్ధమైన రైల్వే స్టేషన్లు.. ప్రారంభించనున్న మోదీ

Railway Stations | ఆధునిక హంగులతో సిద్ధమైన రైల్వే స్టేషన్లు.. ప్రారంభించనున్న మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Stations | కేంద్ర ప్రభుత్వం central govt రైల్వే స్టేషన్ల railway stations ఆధునికీకరణకు అనేక నిధులు వెచ్చిస్తోంది. రైల్వే స్టేషన్లలో వసతుల కల్పనతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతోంది.

అమృత్​ భారత్ amrit bharat scheme​ పథకం కింద కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన హైదరాబాద్​లోని బేగంపేట begumpet railway station, కరీంనగర్ karimnagar railway station, వరంగల్ warangal railway station రైల్వేస్టేషన్లను ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi వర్చువల్​గా వీటిని పున: ప్రారంభించనున్నారు.

Railway Stations | ఆధునిక వసతులతో..

రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. బేగంపేట స్టేషన్​ను రూ.26.55 కోట్లు, కరీంనగర్ 25.85 కోట్లు, వరంగల్​ రైల్వే స్టేషన్​ను 25.41 కోట్లతో ఆధునీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్​లోని బేగంపేట స్టేషన్​లో ఎయిర్​పోర్టు మాదిరి సౌకర్యాలు కల్పించారు. ప్రధాని మోదీ స్టేషన్లను ప్రారంభించనున్న దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Railway Stations | లిఫ్ట్​లు.. ఎస్కలేటర్లు

అమృత్​ భారత్​ పథకంలో భాగంగా కరీంనగర్​ రైల్వే స్టేషన్​లో రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, రెండు కొత్త ప్లాట్​ఫామ్​లు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్స్ ac waiting halls నిర్మించారు. రైల్వే స్టేషన్​ మొత్తం సీసీ కెమెరాలు అమర్చారు. స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు. వరంగల్​లో సైతం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారు.

Must Read
Related News