HomeUncategorizedPrime Minister Modi | ఇందిర‌ను అధిగ‌మించిన మోదీ.. 4,078 రోజులు ప్ర‌ధానిగా సేవ‌లు

Prime Minister Modi | ఇందిర‌ను అధిగ‌మించిన మోదీ.. 4,078 రోజులు ప్ర‌ధానిగా సేవ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prime Minister Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ‌రో రికార్డు సాధించారు. ప్ర‌ధానిగా అత్య‌ధిక రోజులు సేవ‌లందించిన రెండో వ్య‌క్తిగా నిలిచారు. వ‌రుస‌గా మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న పాల‌న‌లో మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీని (Former PM Indira Gandhi) అధిగ‌మించారు. 1966 నుంచి 1977 మ‌ధ్య ఇందిరాగాంధీ 4,077 రోజుల పాటు ప్ర‌ధానిగా నిరంత‌ర పాల‌న‌ను కొన‌సాగించారు. అయితే, మోదీ ఆ రికార్డును అధిగ‌మిస్తూ శుక్ర‌వారంతో 4,078 రోజులు పూర్తి చేస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ(PM Jawaharlal Nehru) మోదీ కంటే ముందున్నారు.

Prime Minister Modi | మోదీ రాజకీయ మైలురాళ్లు..

ఛాయ్‌వాలాగా కింది స్థాయి నుంచి ఎదిగిన మోదీ.. ఈ క్ర‌మంలో అనేక మైలురాళ్లు అధిగ‌మించారు. ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, హిందీ మాట్లాడని రాష్ట్రం నుండి ఇంత కాలం పనిచేసిన ఏకైక ప్రధానమంత్రిగా రికార్డులకెక్కారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో జన్మించిన మొదటి ప్రధానమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

స్ప‌ష్ట‌మైన మెజార్టీతో రెండుసార్లు తిరిగి ఎన్నికైన మొద‌టి కాంగ్రెసేత‌ర నాయ‌కుడు ఆయ‌నే. అలాగే రెండుసార్లు పూర్తి పదవీకాలాలను పూర్తి చేసి తొలి కాంగ్రెసేతర నాయకుడు కూడా. 1971లో ఇందిరా గాంధీ తర్వాత వరుస సార్వత్రిక ఎన్నికలలో (General Election) పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధానమంత్రి కూడా ఆయనే. నెహ్రూ త‌ర్వాత వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నిక‌ల్లో విజయాల్లో (2014, 2019, 2024) విజ‌యం సాధించిన ప్రధాని కూడా మోదీ (Prime Minister Modi)నే కావ‌డం విశేషం..

Prime Minister Modi | ఛాయ్‌వాలా నుంచి ప్ర‌పంచ చేత‌గా..

మోదీ రాజకీయ ప్ర‌స్థానం ప్ర‌స్తుత నేత‌ల‌కు, భావిత‌రాల‌కు ఆద‌ర్శ‌నీయం. గుజరాత్‌లోని (Gujrath) వాద్‌నగర్‌లో నిరాడంబరమైన కుటుంబంలో జన్మించిన ఆయన చిన్న‌త‌నంలో రైల్వే స్టేషన్‌లో టీ అమ్మడంలో తన తండ్రికి సహాయం చేశారు. ఆ త‌ర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేర‌డంతో ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. తరువాత భారతీయ జనతా పార్టీలో (BJP) చేరి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఎదిగారు. ద‌శాబ్దకాలం పాటు సీఎంగా, ఆ త‌ర్వాత జాతీయ నేత‌గా మారిన మోదీ.. 2014లో అఖండ విజయం సాధించిన త‌ర్వాత ఎదురు లేకుండా పోయింది. ప‌ట్టుద‌ల‌, ప‌టిష్ట కృషితో ఆయ‌న ఇవాళ ప్ర‌పంచ నాయ‌కుడిగా ఎదిగారు. కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, వివిధ హోదాల్లో దాదాపు 24 సంవత్సరాల తన ప్రయాణంలో విస్తృతంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ నాయకుడిగా పేరొందారు. భారతదేశ దృఢత్వానికి చిహ్నంగా మారారు.

Must Read
Related News