ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | ట్రంప్​ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Revanth Reddy | ట్రంప్​ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఒత్తిడికి భయపడి లొంగిపోయారని సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ట్రంప్​ భయపెట్టడంతో మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారన్నారు.


    కేంద్ర ప్రభుత్వం(Central Government) పాకిస్తాన్​ను చిత్తు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వెనకడుగు వేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump​)​ ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాలు ఆపానని చెబుతున్నారన్నారు. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తానని చెప్పడంతో భారత్​ ​ కాల్పుల విరమణకు అంగీకరించదని చెప్పారన్నారు. దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్​ ఒత్తిడికి లొంగిపోయిందన్నారు. గతంలో పాక్‌తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఒత్తిళ్లను ఇందిరాగాంధీ పట్టించుకోలేదన్నారు. ఈ అంశంలో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కార్‌ తలొగ్గిందని సీఎం ఆరోపించారు.

    ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ అనంతరం భారత్​ దళాలు పాకిస్తాన్​ను చిత్తు చేస్తున్న సమయంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు ప్రకటించారు. అయితే భారత్​ మాత్రం పాకిస్తాన్(Pakistan)​ కోరడంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెబుతోంది. అయితే ట్రంప్​ ముందుగా ప్రకటించడంతో విపక్ష పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
    కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...