అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pm modi | భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump కు ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi షాక్ ఇచ్చారు.
ట్రంప్ మాట్లాడేందుకు ఫోన్ చేయగా.. ప్రధాని అందుబాటులోకి రాలేదు. నాలుగుసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయనట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
టారిఫ్‌లపై తీవ్ర అసహనంతో ఉన్న మోడీ.. కావాలనే ఆయనను అవాయిడ్ చేసినట్లుగా తెలుస్తోందని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్ (FAZ), జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా పేర్కొన్నాయి.
ఇది ట్రంప్‌పై మోడీకి ఉన్న కోపం లోతునకు నిదర్శనమని పేర్కొన్నాయి. ట్రంప్ కాల్స్‌ను ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని, ఇది ట్రంప్‌లో నిరాశను పెంచుతుందని జపాన్ వార్తా పత్రిక నిక్కీ ఆసియా పేర్కొంది.
Pm modi | సుంకాల బాదుడుతో..
రష్యా నుంచి చమురు కొంటున్నారన్న కారణాన్ని చూపుతూ ట్రంప్ భారత్‌పై రెండు విడుతల్లో కలిపి 50 శాతం టారిఫ్ విధించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతంగా మారాయి.
రష్యా నుంచి భారత్ మాత్రమే కాకుండా చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కొంటున్నాయి. ఆయా దేశాలపై టారిఫ్ విధించని ట్రంప్ కేవలం ఇండియాను లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తీరుపై మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులు, పశు పోషకులు, వ్యాపారుల ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడబోమని ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తాము భరిస్తామని చెప్పారు.
Pm modi | ట్రంప్ ఫోన్ తీయని మోడీ
ఆప్తమిత్రుడైన ట్రంప్ ఇలా టారిఫ్‌లతో విరుచుకు పడటంతో ప్రధాని నొచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించినా మోడీ అందుబాటులోకి రాలేదు.
ట్రంప్ నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని కాల్స్ లిఫ్ట్ చేయనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చిన నాలుగు కాల్స్‌ను స్వీకరించడానికి మోదీ నిరాకరించారని పేర్కొంది.
ట్రంప్‌తో మాట్లాడటానికి ప్రధాని మోడీ ఇష్టపడకపోవడం.. అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల ప్రధాని ఎంతగా చిరాకు పడ్డారో చూపిస్తుందని తెలిపింది.
చైనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో ఇండియా, అమెరికా గత రెండు దశాబ్దాలుగా దగ్గరయ్యాయి.
కానీ ఇప్పుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తుండటంతో చైనాను అదుపులో ఉంచడానికి అమెరికా తీసుకొచ్చిన ఇండో-పసిఫిక్ అలైన్‌మెంట్ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.