అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Narendra Modi | భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) మరో అరుదైన గౌరవం దక్కింది. ఒమన్ పర్యటనలో ఉన్న మోదీకి ఆ దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’ (The First Class of the Order of Oman) లభించింది. ఒమన్ (Oman) రాజధాని మస్కట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ II, జపాన్ చక్రవర్తి అకిహిటో, నెదర్లాండ్స్ రాణి మాక్సిమా, జోర్డాన్ రాజు అబ్దుల్లా, నెల్సన్ మండేలా వంటి దిగ్గజాలు అందుకున్నారు. తాజాగా మోదీ వీరి సరసన నిలిచారు. కాగా.. ప్రధాని మోదీకి లభించిన 29వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
PM Narendra Modi | ఒమన్ సుల్తాన్‌తో భేటీ
భారత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మస్కట్‌లోని అల్ బరాకా ప్యాలెస్‌లో గురువారం ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇండియా, ఒమన్ మధ్య దీర్ఘకాల సంబంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు.