అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ట్రంప్ గాజాలో శాంతి స్థాపనకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. హమాస్, ఇజ్రాయెల్ మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ యుద్ధంతో లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో గాజా(Gaza)లో శాంతిస్థాపనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు. ఈ మేరకు 20 పాయింట్ల ప్రణాళికను ఆయన ముందుకు తీసుకొచ్చారు. దీనిని ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఈ ప్రణాళిక మేరకు బందీలను విడుదల చేసేందుకు హమాస్ సైతం ముందుకు వచ్చింది. దీంతో ప్రధాని మోదీ(PM Modi) ట్రంప్ చర్యలను సమర్థిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను ఆయన అభినందించారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.
PM Modi | ట్రంప్ బెదిరించడంతో..
ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరించినా మొదట హమాస్(Hamas) ఒకే చెప్పలేదు. దీంతో ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం లోపు ప్రణాళికను అంగీరించకపోతే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో హమాస్ నాయకులు దిగొచ్చారు. ఈ మేరకు ప్రణాళికలోని కొన్ని పాయింట్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు.
కాగా 2023 అక్టోబర్ 7 హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్(Israel)పై దాడి చేసి 250 మందికి పైగా పౌరులను బందీలుగా తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ హమాస్‌పై ప్రతిదాడులు చేపట్టింది. అప్పటి నుంచి యుద్ధం సాగుతూనే ఉంది. అయితే గతంలో హమాస్ పలువురు బందీలను విడుదల చేసింది. తాజాగా మొత్తం బందీలను విడుదల చేయడానికి ఒప్పుకుంది. అలాగే గాజా పరిపాలనను సైతం పాలస్తీనా టెక్నోక్రాట్స్‌కి అప్పగించేందుకు హమాస్ సిద్ధం అవుతోంది.