HomeUncategorizedPlane Crash | మృత్యుంజ‌యుడిని ప్ర‌త్యేకంగా క‌లిసి ప‌ల‌క‌రించిన మోదీ.. ఎలా బ్రతికానో తెలియ‌ద‌న్న ర‌మేష్

Plane Crash | మృత్యుంజ‌యుడిని ప్ర‌త్యేకంగా క‌లిసి ప‌ల‌క‌రించిన మోదీ.. ఎలా బ్రతికానో తెలియ‌ద‌న్న ర‌మేష్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Plane Crash | అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. జూన్ 12న జ‌రిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అహ్మదాబాద్‌లో పర్యటించి, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ , నేరుగా మేఘానీనగర్‌లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు.

Plane Crash | మృత్యుంజ‌యుడిని క‌లిసిన మోదీ..

అనంతరం, ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్ vishwas kumar ramesh చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా భవంతిలోకి విమానం దూసుకుపోయి పోలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ డ్యామేజ్ జరిగింది.

మొదట నేను చనిపోయానని అనుకున్నాను. ఆ తర్వాత నేను బతికున్నట్టు గ్రహించాను. విమాన ప్రధాన భాగం తెరుచుకోవడంతో పాకుకుంటూ బయటపడ్డాను. నా చుట్టూ ఉన్న వారు చనిపోవడమో, చావుకు చేరువలో ఉండటమో కనిపించింది అని చెప్పారు. విమానం Filght నుంచి బయటపడగానే విమానం పేలిపోయింది అంటూ అరుస్తూ ఆయన బయటకు రావడం వీడియో ఫుటేజ్‌(Video footage)లో కనిపిస్తోంది. విమానం కుప్పకూలిన తర్వాత రమేష్ దాని నుంచి జంప్ చేయడం, ఆ తర్వాత స్పృహకోల్పోవడం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన తీవ్రంగా కలిసి వేసిందని, అధికారులు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో తమ ప్రియతములను కోల్పోయిన వారి చుట్టూనే తన ఆలోచనను తిరుగుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.