అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంతోషంగా లేరని ఆయన అన్నారు.తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చాలా మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పారు.
అయితే తాము విధించిన అధిక సుంకాలపై భారత నాయకుడు తనపై అసంతృప్తితో ఉన్నారని అంగీకరించారు. హౌస్ జీఓపీ సభ్యుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలలో ఉన్న ఒత్తిడిని ప్రస్తావించారు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించిందని మరోసారి చెప్పారు.
Donald Trump | రక్షణ సహకారంపై..
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అపాచీ హెలికాప్టర్ల (Apache Helicopters)పై ట్రంప్ మాట్లాడారు. భారత్ చాలా సంవత్సరాలుగా అపాచీ హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తోందన్నారు. ఈ విషయం పురోగతిలో ఉందన్నారు. ఇండియా 68 హెలికాప్టర్లను ఆర్డర్ చేసిందని తెలిపారు. కాగా ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా (Russia) నుంచి చమురు దిగుమతి ఆపేయకపోతే టారిఫ్స్ పెంచుతామన్నారు. భారత ప్రధాని మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే తాను సంతోషంగా లేననే విషయం మోదీకి తెలుసన్నారు. తాజాగా మరోసారి ఆయన భారత్‌పై సుంకాలు, మోదీ గురించి మాట్లాడటం గమనార్హం. మరోవైపు వాణిజ్యంపై ఇరుదేశాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.