Homeఅంతర్జాతీయంDonald Trump | మోదీ గొప్ప వ్యక్తి.. త్వరలో భారత్ పర్యటనకు వస్తా: డొనాల్డ్ ట్రంప్

Donald Trump | మోదీ గొప్ప వ్యక్తి.. త్వరలో భారత్ పర్యటనకు వస్తా: డొనాల్డ్ ట్రంప్

భారత్​తో వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని ట్రంప్​ తెలిపారు. మోదీ తన స్నేహితుడని, ఆయనను కలవడానికి త్వరలో భారత్​లో పర్యటిస్తానని చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | భారత్​పై ఇటీవల భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​తో వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది తాను భారత పర్యటనకు వస్తానన్నారు.

రష్యా నుంచి ముడి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామనే కారణంతో ట్రంప్​ (Donald Trump) భారత్​పై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. పలు ఉత్పత్తులపై 50శాతం, మరికొన్నింటిపై వంద శాతం టారిఫ్​లు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలమైతే సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనిపై ట్రంప్​ మాట్లాడుతూ.. చర్చలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.

Donald Trump | మోదీ నా స్నేహితుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గొప్ప వ్యక్తి అని, ఆయన నా స్నేహితుడు అని ట్రంప్​ ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి వచ్చే ఏడాది తాను భారత్​ వెళ్లవచ్చన్నారు. మోదీ రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేయడం చాలావరకు మానేశారని ట్రంప్​ పేర్కొన్నారు. కాగా.. అమెరికాతో చర్చలపై ఇటీవల భారత వాణిజ్య శాఖ మంత్రి (Indian Commerce Minister) మాట్లాడుతూ.. చర్చలు బాగా జరుగుతున్నాయన్నారు. సున్నితమైన తీవ్రమైన సమస్యలు ఉండడంతో దీనికి కొంత సమయం పడుతుందన్నారు.

కాగా.. రష్యా భారత్​కు (India) తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తోంది. దీంతో దేశ అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి కొంతకాలంగా భారీమొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే అమెరికా (America) ఆంక్షలు విధించినా భారత్​ వెనక్కి తగ్గలేదు. అయితే ఇటీవల పలుమార్లు ట్రంప్​ భారత్​ నుంచి రష్యా ఆయిల్​ దిగుమతులు ఆపేసిందని ప్రకటించారు. అయితే భారత్​ మాత్రం కొనసాగిస్తూనే వస్తోంది. మరోసారి ట్రంప్​ రష్యా నుంచి భారత్​ ముడి చమురు కొనుగోలు తగ్గించిందని చెప్పారు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.

Must Read
Related News