ePaper
More
    HomeజాతీయంPM Modi | ట్రంప్​కు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చిన మోదీ.. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని...

    PM Modi | ట్రంప్​కు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చిన మోదీ.. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదిరిపోయే కౌంటర్​ ఇచ్చారు. భారత్​ రష్యా నుంచి ఆయిల్​, ఆయుధాలు దిగుమతి చేసుకుంటుండడంతో ట్రంప్​ 25 శాతం టారిఫ్స్​ విధించిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ట్రంప్​ ఇడియా ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి డెడ్​ ఎకానమీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ (PM Modi) శనివారం పరోక్షంగా కౌంటర్​ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​ పర్యటనలో ఉన్న ఆయన వారణాసిలో మాట్లాడారు. త్వరలో భారత్​ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

    PM Modi | అప్రమత్తంగా ఉండాలి

    ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉందని మోదీ తెలిపారు. దీంతో అన్ని దేశాల సొంత ప్రయోజనాలపై దృష్టి పెట్టాయన్నారు. మనం కూడా స్వదేశీ ఉత్పత్తులను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జర్మనీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల భారత్ జపాన్​ను దాటేసి నాలుగో స్థానంలోకి వచ్చింది. దీంతో మోదీ మాట్లాడుతూ.. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి మారడానికి మనం ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారతీయులు (Indians) తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.

    READ ALSO  Mansa Devi temple | హరిద్వార్‌ మానసదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

    PM Modi | కాంగ్రెస్​పై విమర్శలు

    ప్రధాని మోదీ కాంగ్రెస్​(Congress)పై విమర్శలు చేశారు. ఆపరేషన్​ సిందూర్​ ​(Operation Sindoor) ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రధాని తెలిపారు. పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసమైతే కాంగ్రెస్‌, దాని మిత్ర పార్టీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఇటీవల ఆపరేషన్​ మహదేవ్(Operation Mahadev)​ చేపట్టి పహల్గామ్​ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసింది. దీనిపై మోదీ స్పందిస్తూ.. మహాదేవుడి ఆశీస్సులతో పహల్గామ్​ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this