అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా మరోసారి తన ప్రసంగ శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎర్రకోట (Red Fort) పైనుంచి వరుసగా 12వ సారి ప్రసంగించిన మోదీ.. ఈసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసి సరికొత్త రికార్డును (New Record) నమోదు చేశారు. ఉదయం 7:33 గంటలకు ప్రారంభమైన మోదీ ప్రసంగం.. 9:18 గంటలకు ముగిసింది. మొత్తంగా 105 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగం ద్వారా ఆయన గతేడాది (2024లో) చేసిన 98 నిమిషాల రికార్డును అధిగమించారు.
PM Narendra Modi | రికార్డ్ బ్రేక్..
మోదీ (PM Narendra Modi) ఎర్రకోటపై వరుసగా 12వ సారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (11 సార్లు) రికార్డును అధిగమించారు. ఇప్పటివరకు జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే ఎక్కువసార్లు (17) సార్లు ప్రసంగించారు. మరి ఈ రికార్డును మోదీ బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక మోదీ గత ప్రసంగాల కాలవ్యవధి చూస్తే..
2016 – 96 నిమిషాలు
2019 – 92 నిమిషాలు
2023 – 90 నిమిషాలు
2017 – కేవలం 56 నిమిషాలు (అత్యల్పం)
ఈ సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీ.. 2047 నాటికి “వికసిత భారత్”(Vikasit Bharath) లక్ష్యంపై దృష్టి పెట్టారు. తాను చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆర్థిక పురోగతి, టెక్నాలజీ అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా వివరించారు. ‘నయా భారత్’ నిర్మాణంలో ప్రజల పాత్ర గురించి ప్రస్తావించారు. అలానే కొన్ని శుభవార్తలు అందించారు. పలు వస్తువులపై అధిక పన్ను ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని పన్నులు తగ్గిస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 0 శాతం, 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. అయితే కేంద్రం 12శాతం శ్లాబును రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎర్రకోట నుంచి పాకిస్తాన్కు (Pakistan) మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. సింధూ జలాల(Indus River)పై దాయాదీ దేశంతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని ఆయన అన్నారు. మొత్తానికి ఈ ప్రసంగం ద్వారా మోదీ తన రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.