అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | ప్రజాస్వామ్యంలో రాడికలిజానికి చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖలిస్తానీ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్(Prime Minister Keir Starmer)ను కోరారు.
గురువారం ఇరువురి మధ్య ముంబైలో జరిగిన సమావేశంలో ఖలిస్తానీ తీవ్రవాదం అంశంపై ఇద్దరు ప్రధానులు కులంకషంగా చర్చించారు. ప్రజాస్వామ్య దేశాల్లో రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి చోటు లేదని ప్రధాని మోదీ (Prime Minister Modi) నొక్కి చెప్పారు. ఈ మేరకు భేటీ వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. బ్రిటన్లోని 125 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు, విద్యావేత్తల ప్రతినిధి బృందంతో కలిసి బ్రిటిష్ ప్రధాని ఇండియా పర్యటనకు వచ్చారు. ఇది ఆయన తొలి పర్యటన.
PM Modi | ప్రజాస్వామ్య సమాజాలలో రాడికలిజానికి చోటు లేదు
“ప్రధాని మోదీ, ప్రధాని స్టార్మర్ మధ్య ఈరోజు జరిగిన సమావేశంలో ఖలిస్తానీ తీవ్రవాదం (Khalistan terrorism) అంశంపై చర్చ జరగింది. ప్రజాస్వామ్య సమాజాలలో రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి చోటు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తీవ్రవాదులు స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి లేదా దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదని తెలిపారు. అందుబాటులో ఉన్న చట్టపరమైన చట్రంలో తీవ్రవాద శక్తులపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కి చెప్పారు” అని మిస్రీ వివరించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా స్థానం సంపాదించడానికి ఇండియా యూకే మద్దతు పొందిందని మిస్రి తెలిపారు.. “మేము దానిని స్వాగతిస్తున్నాము. అభినందిస్తున్నాము” అని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) భారతదేశ వికసిత భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.