4
అక్షరటుడే, ఆర్మూర్: Kotapati Narasimha Nayudu | సాగులో ఆధునిక పద్ధతులు అవలంభించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జయశంకర్ వర్సిటీ సలహాకమిటీ సభ్యుడు కోటపాటి నర్సింహానాయుడు(Kotapati Narasimha Nayudu) పేర్కొన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలు, నూతన సాగు పద్ధతులు, అధిక దిగుబడికి వాడాల్సిన ఎరువులపై అవగాహన కల్పించారు. రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్త సాయి చరణ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ అశోక్, జిల్లా వ్యవసాయాధికారిణి విజయలక్ష్మి, రోహిత్ రెడ్డి, ఉమ్మి సాహెర్, అశోక్ కుమార్, ఉమాదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.