అక్షరటుడే, బాన్సువాడ: Oxford School | దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ముందస్తు దీపావళి (Diwali) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంలో చిన్నపిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారిన జంక్ ఫుడ్‌లను (Junk food) ఆధునిక నరకాసురుడిగా ప్రతీకాత్మకంగా చూపించారు. జంక్ ఫుడ్ నరకాసురుని బొమ్మ దహనం కార్యక్రమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా జంక్ ఫుడ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై పిల్లల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపాల్ లావణ్య నరేష్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సౌభాగ్య, వీణ, సునీత, సుష్మా, రేఖ, మౌనిక, గౌతమి, సవిత తదితరులు పాల్గొన్నారు.