Rain Alert
Rain Alert | పలు జిల్లాలకు నేడు మోస్తరు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. నిత్యం వానలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ​ (IMD) అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వాతావరణంలో తేమతో ఉక్కపోత ఇబ్బంది పెడుతుంది. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయి. మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, కామారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, నాగర్​ కర్నూల్​ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

నగరంలో సాయంత్రం వరకు వర్షాలు పడే ఛాన్స్​ లేదు. వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షాలు పడుతాయి. శుక్రవారం సైతం హైదరాబాద్​ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. గత మూడు రోజులుగా నగరంలో వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల కాలనీలు నీట మునగడంతో ఇంట్లో సామగ్రి తడిసిపోయి వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.

Rain Alert | ఉధృతంగా పారుతున్న నదులు

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్ని నదులకు భారీగా వరద వస్తోంది. దీంతో ప్రధాన నదులు గోదావరి (Godavari), కృష్ణ (Krishna) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇతర నదులు, వాగులు సైతం ఉధృతంగా పారుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోగా అధికారులు తాత్కాలిక రోడ్లు వేశారు. అయితే మళ్లీ వర్షాలు పడుతుండటంతో తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.