అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు వర్షాలు (Moderate Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉంది.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad)లో శనివారం వినాయకుడి నిమజ్జన (Ganesh Immersion) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. వర్షం పడితే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే నగరంలో నేడు వాన పడే ఛాన్స్ లేదని అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ పడినా చిరుజల్లులు మాత్రమే కురుస్తాయన్నారు.
Weather Updates | భారీ వర్షాలు అప్పుడే..
రాష్ట్రంలో ఆగస్టు 26 రాత్రి నుంచి 28 వరకు కుండపోత వానలు (Heavy Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం (Crop Damage) జరిగింది. సెప్టెంబర్ 9 తర్వాత తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం వరి పంటలు పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో భారీ వర్షాలు పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇటీవల కురిసిన వానలకు చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూముల్లో రాళ్లు, ఇసుక, బురద పేరుకుపోవడంతో అవి సాగుకు పనికి రాకుండా పోయాయని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి కుండపోత వానలు పడితే పంట నష్టం అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.