అక్షరటుడే, ఆర్మూర్: Armoor Modal School | పట్టణంలోని మామిడిపల్లి (mamidi palli) చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్లో (Government Model School) వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ శ్యాం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని రశ్మిత 581 మార్కులు సాధించిందని ఆయన వివరించారు. స్కూల్లో 98 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 74 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్యాం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.