7
అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్‌కు సంబంధించి ఫలితాలు విడుదలైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. అధికారిక వెబ్సైట్ telanganams.cgg.gov.in లో చూసుకోవాలన్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ టెస్ట్ జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా ఆరో తరగతిలో 18,501 మంది విద్యార్థులకు గాను 9,603 ఉత్తీర్ణులయ్యారు. ఏడో తరగతిలో 5,249 విద్యార్థులకు 2,214మంది, ఎనిమిదో తరగతిలో 4,011 మందికి 1448 మంది, 9వ తరగతిలో 2521 మంది విద్యార్థులకు 933 మంది, పదో తరగతిలో 602 మంది విద్యార్థులకు 215 మంది ఉత్తీర్ణత సాధించారు.