MLC Sripal Reddy | కామన్ స్కూల్ విద్యా విధానం తేవాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
MLC Sripal Reddy | కామన్ స్కూల్ విద్యా విధానం తేవాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

అక్షరటుడే, ఇందూరు: MLC Sripal Reddy | రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యా విధానం తీసుకురావాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలోని నియో అంబేద్కర్ భవన్ లో బుధవారం నిర్వహించిన పీఆర్​టీయూ టీఎస్ PRTUTS సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కుల, మతాల విద్యార్థులు చదువుకుంటారని, అందుకే విద్యా వ్యవస్థలో ఒకే విధమైన విద్య ఉండాలన్నారు.

అలాగే ఇతర రాష్ట్రాల మాదిరి టెట్ TET నుంచి మినహాయింపు ఇచ్చేలా కోర్టులో రిట్ పిటీషన్ వేయాలని సీఎంతో మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఇప్పించామన్నారు.

MLC Sripal Reddy | పాత పెన్షన్ విధానం తేయాలి

మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే సీపీఎస్ CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఆ ప్రయత్నంలోనే తామున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రెడ్డి, బిక్షంగౌడ్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్, పెంట జలంధర్, వెంకటేశ్వర్ గౌడ్, లక్ష్మణ్, అసోసియేటర్ అధ్యక్షుడు అంకం నరేష్, అశోక్, సరిత, రాధా, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.