అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌రావు (MLC Naveen Rao)కు సిట్ నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై ప్రభుత్వం ఇటీవల సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ విచారించింది. తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) నవీన్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించింది.
Phone tapping case | ప్రైవేట్ డివైజ్‌తో..
ఎమ్మెల్సీ నవీన్‌రావు ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఎండీ. ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రైవేట్ డివైజ్‌తో ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ డివైజ్‌తో, ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారనే విషయాలను సిట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇటీవల సిట్(SIT) అధికారులు వేగం పెంచారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి కీలక వివరాలు సేకరించారు. ఆయన చెప్పిన సమాధానాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.
Phone tapping case | బీఆర్ఎస్ ముఖ్య నేతలకు..
బీఆర్ఎస్ ముఖ్య నేతల సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సిట్ త్వరలో ఆ పార్టీ కీలక నేతలను విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావును సైతం సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం నోటీసులు ఇస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.