అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడనున్నారు. ఈ నెల 5న ఆమె మండలిలో మాట్లాడటానికి ఛైర్మన్ అంగీకరించారు.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. తాను రాజీనామా చేసి నాలుగు నెలలు అవుతోందన్నారు. దానిని ఆమోదించాలని కోరారు. అంతలోపు తనకు కౌన్సిల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోరారు. అందుకు ఛైర్మన్ అంగీకరించారు. దీంతో ఈ నెల 5న ఎమ్మెల్సీ కవిత మండలిలో మాట్లాడనున్నారు.
MLC Kavitha | ఏం మాట్లాడుతారో..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సస్పెండ్ చేసింది. దీంతో ఆమె సెప్టెంబర్‌లో పార్టీతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ ఇంతవరకు రాజీనామా ఆమోదించలేదు. అయితే కవిత కొంతకాలంగా జనంబాట పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హరీశ్‌రావు (Harish Rao) పై ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మండలిలో ఆమె ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది. మరోసారి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తారా.. లేక అవినీతి అక్రమాలపై బాంబు పేలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
కాగా ఛైర్మన్‌ను కలిసిన అనంతరం కవిత మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేసీఆర్ (KCR) ను ఉగ్రవాది కసబ్‌తో పోల్చిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిపై ఇలాంటి నీచమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు విన్నప్పుడు కేసీఆర్ కుమార్తెగా తన రక్తం మరిగిపోతోందన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రికి తగనివి కావన్నారు.