అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16న అమెరికా వెళ్లనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కవిత దంపతులు వెళ్లనున్నారు. ఈ నెల 23న ఆమె తిరిగి రానున్నారు. అయితే మద్యం కుంభకోణం కేసులో బెయిల్ ఉన్న ఆమె విదేశాలకు వెళ్లడానికి ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
