4
అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | మాజీ సీఎం కేసీఆర్ (former cm kcr)కు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. తెలంగాణ పొలాల్లోకి గోదావరి జలాలు (godavari water) పారించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని కవిత పేర్కొన్నారు. రాజకీయ కుట్ర, దురుద్దేశంతో ఆయనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తప్పకుండా న్యాయమే గెలుస్తుందని కవిత పేర్కొన్నారు.