అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు బీఆర్ఎస్తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్(brs)ను బీజేపీ(bjp)లో విలీనం చేయాలని చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్(ktr) నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని పరోక్షంగా చెప్పారు. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్(banjara hills)లో శనివారం సాయంత్రం ఆమె జాగృతి కార్యాలయాన్ని (jagruthi office) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్(kcr)కు బీఆర్ఎస్ పార్టీ కన్ను అయితే జాగృతి మరో కన్ను అన్నారు. తాను కేసీఆర్, తెలంగాణ కోసం పనిచేస్తుంటే ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ మీద ఈగ కూడా వాలనివ్వనని అన్నారు.
MLC Kavitha | రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడం మన ఖర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikasam Scheme)పై ఆమె స్పందించారు. తెలంగాణకు రాజీవ్‌గాంధీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ యువ వికాసం పేరుతో పథకాలు ఉండాలన్నారు.
MLC Kavitha | కేసీఆర్‌కు నోటీసులపై ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇటీవల కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతామని తెలిపారు.
MLC Kavitha | కనిపించని బీఆర్ఎస్ ఆనవాళ్లు
కవిత ప్రారంభించిన జాగృతి కార్యాలయంలో బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చూసుకున్నారు. తన తండ్రి కేసీఆర్ ఫొటో మాత్రమే కార్యాలయంలో పెట్టారు. బీఆర్ఎస్ నాయకులు, జెండాలు ఎవీ పెట్టలేదు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్, మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు పెట్టారు.