ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కవిత పర్యటనలో కనిపించని జోష్.. దూరంగా ఉన్న గులాబీ శ్రేణులు

    MLC Kavitha | కవిత పర్యటనలో కనిపించని జోష్.. దూరంగా ఉన్న గులాబీ శ్రేణులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) మూడ్రోజులుగా పర్యటించారు. ఆలయాల సందర్శనలు, పరామర్శలతో బిజీగా గడిపారు.

    అయితే, కవిత జిల్లాకు ఎప్పుడు వచ్చినా హడావుడి చేసే బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఈసారి మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. అసలు ఆమె పర్యటనకే దూరంగా ఉండిపోయాయి. ఉమ్మ‌డి జిల్లాకు (Joint Districts) చెందిన ముఖ్య నేత‌ల‌తో పాటు కింది స్థాయి నాయ‌కులు సైతం క‌విత (Kavitha) వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. పార్టీ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన ఆదేశాల నేప‌థ్యంలో కేడ‌ర్ మొత్తం ఆమె ప‌ర్య‌ట‌నను పట్టించుకోలేదు. ఇప్ప‌డిదే అంశం ఉమ్మ‌డి జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

    MLC Kavitha | క‌విత పోరుబాట..

    బీఆర్ఎస్‌లో ప్ర‌ధానంగా కేసీఆర్ కుటుంబంలో (KCR Family) కొన్నాళ్లుగా నెల‌కొన్న ఆధిప‌త్య పోరు ఇటీవ‌ల క‌విత లేఖ‌తో (Kavitha Letter) బ‌య‌ట‌ప‌డింది. ఆమె త‌న తండ్రికి ర‌హ‌స్యంగా రాసిన లేఖ బ‌యట‌కు రావ‌డం, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు రాష్ట్ర రాజ‌కీయాల్లో (State politics) సంచ‌ల‌నంగా మారాయి. కేటీఆర్‌ (KTR), కవిత (Kavitha) మ‌ధ్య పూడ్చ‌లేనంత ఆగాధం పెరిగి పోయింద‌ని వారి వ్యాఖ్య‌లు తేట‌తెల్లం చేశాయి.

    పైగా త‌న సోద‌రుడితో పాటు హ‌రీశ్‌రావు (Harish Rao) పైనా ఆమె పేరు ఎత్త‌కుండానే విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతెందుకు త‌న తండ్రిని సైతం వివాదంలోకి లాగారు. ఇన్నాళ్లు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో పార్టీని ఏలిన కేసీఆర్‌ (KCR).. త‌న కుటుంబంలో త‌లెత్తిన వివాదంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. క‌విత ఎపిసోడ్ నేప‌థ్యంలో ఎవ‌రూ స్పందించ‌వ‌ద్ద‌ని పార్టీ శ్రేణుల‌కు అంత‌ర్గ‌తంగా ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు, జాగృతితో పోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతున్న క‌విత వెంట ఎవ‌రూ వెళ్లొద్ద‌ని సూచ‌న‌లు వ‌చ్చాయి.

    MLC Kavitha | ప‌ట్టించుకోని బీఆర్ఎస్

    కేసీఆర్ దేవుడంటూ క‌విత జాగృతిని బ‌లోపేతం చేస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. కేసీఆర్‌కు కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు (Kaleshwaram commission notice) ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ హైద‌రాబాద్‌లో (Hyderabad) ధ‌ర్నా కూడా నిర్వ‌హించారు. అనంత‌రం నిజామాబాద్‌ (Nizamabad), జ‌గిత్యాల జిల్లాల్లో క‌విత ప‌ర్య‌టించారు. కానీ, హైద‌రాబాద్ ధ‌ర్నాలో కానీ, నిజామాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కానీ ఎక్క‌డా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన‌లేదు. అస‌లు గులాబీ జెండాలే (Gulabi Flages) క‌నబ‌డ‌లేదు.

    హైక‌మాండ్ ఆదేశాల మేర‌కే గులాబీ శ్రేణులు క‌విత ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్న‌ట్లు తెలిసింది. మూడు రోజులు ఆమె నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) ప‌ర్య‌టించినా ముఖ్య నేత‌లు స‌హా కింది స్థాయి నాయ‌కులు ఎవ‌రూ వెళ్ల‌లేదు. ఖిల్లా జైలు (Quilla Jail) సంద‌ర్శ‌న స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ మాత్రం క‌విత వెంట క‌నిపించారు. మిగ‌తా వారెవ‌రూ అస‌లు ప‌ట్టించుకోనే లేదు. గ‌తంలో క‌విత‌ ఎప్పుడు వ‌చ్చినా పెద్ద సంఖ్య‌లో మందీమార్బ‌లం ఉండేది. ఈసారి మాత్రం ఆమె ప‌ర్య‌ట‌న ఏమాత్రం హ‌డావుడి లేకుండా సాగిపోవడం చర్చకు దారితీసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...