అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | సామాన్య ప్రజలకు షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్ పాస్ ధరల (RTC bus pass prices) పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆధ్వర్యంలో మంగళవారం బస్ భవన్ ముట్టడి నిర్వహించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత బస్ భవన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kalvakuntla Kavitha) అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బస్ పాస్ ధరలను (bus pass prices) పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని మండిపడ్డారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజలను దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అలవాటుపడిందని మండిపడ్డారు. సర్కారు వెంటనే స్పందించి బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగా.. కవితను అరెస్టు చేసిన పోలీసులు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
MLC Kavitha | బస్ భవన్‌ను ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు
Published on
