ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | బీఆర్​ఎస్​ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | బీఆర్​ఎస్​ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్(BRS)​ అధినేత కేసీఆర్(KCR)​ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ పార్టీనీ బీజేపీలో (brs – bjp merging) కలపాలని చూస్తున్నారని అన్నారు. ఆమె గురువారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేయొద్దని తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆమె తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ లేఖను బయట పెట్టింది ఎవరని కవిత ప్రశ్నించారు.

    కవిత కొత్త పార్టీ పెడతారని, కాంగ్రెస్​లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీలో బీఆర్​ఎస్​లో విలీనం చేస్తామని తాను జైలులో ఉన్నప్పుడే అడిగారని ఆమె పేర్కొన్నారు. తనకు వెన్ను పోటు రాజకీయాలు తెలియవని ఆమె తెలిపారు.

    MLC Kavitha | పార్టీ నడిపే తీరు ఇదేనా..

    తాను కేసీఆర్​లా చాలా తిక్క ఉన్న మనిషినని.. ఎవరికీ భయపడనని కవిత అన్నారు. పార్టీని నడిపే తీరు ఇదేనా అని ఆమె మండిపడ్డారు. పరోక్షంగా కేటీఆర్​(KTR)ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చేతకాని వారు తనకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో కవిత బీఆర్​ఎస్​తో తెగదింపులు చేసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    MLC Kavitha | పార్టీ ఎందుకు ఖండించలేదు

    ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్​ వద్దన్నారని ఆమె తెలిపారు. తన జోలికి వస్తే బాగుండదని కవిత హెచ్చరించారు. తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పార్టీ సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేశారన్నారు. బీఆర్​ఎస్​లో కేసీఆర్‌ ఒక్కరే నాయకుడని కవిత అన్నారు.

    MLC Kavitha | నన్ను కావాలనే ఓడించారు

    కాంగ్రెస్‌(Congress) పార్టీ ఓ మునిగిపోయే నావ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తనకు, కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో(MP Elections) ఓడించారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...