ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించ లేక‌పోయాం: ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    MLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించ లేక‌పోయాం: ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(Mlc Kavitha) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ.. సామాజిక తెలంగాణ సాధించుకోలేక కపోయామన్నారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌(Telangana Bhavan)లో గురువారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడారు. మేడే సందర్భంగా కార్మికులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామ‌ని, ఇప్ప‌టికైనా ఆ దిశగా భవిష్యత్తు అడుగులు వేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. మేడే స్పూర్తితో తెలంగాణ(Telangana)లో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    MLC Kavitha | ఇవేం అస‌మాన‌త‌లు..

    పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో ఇప్ప‌టికీ అస‌మాన‌త‌లు ఉన్నాయ‌ని క‌విత గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో(Rangareddy District) తలసరి ఆదాయం రూ. 8లక్షలు ఉంటే.. వికారాబాద్‌లో(Vikarabad) 1.58 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని వివ‌రించారు. పది‌ కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ఎంతో ప్రమాదకరమన్నారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్పూర్తి కావాలని చెప్పారు.

    MLC Kavitha | కార్మికుల‌కు న్యాయం చేయ‌లేక‌పోయాం..

    బీఆర్‌ఎస్ ప‌దేండ్ల పాల‌న‌లో కార్మికుల‌కు సరైన న్యాయం చేయ‌లేక పోయామ‌ని ఎమ్మెల్సీ కవిత(Mlc kavitha) అంగీకరించారు. రైతుల‌ను ఎన్నో విధాలుగా ఆదుకున్నామ‌ని కార్మికుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. రైతుబంధు(Rythu bandhu) కింద ఎకరం ఉంటే రూ.10 వేలు, పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చామని.. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని తెలిపారు. భవిష్యత్తులో భూమి ఉన్నా, లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ఉంటుంద‌ని చెప్పారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...