ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కాంగ్రెస్ గూటికి క‌విత చేర‌నుందా.. ఏకంగా హైక‌మండ్‌తో చ‌ర్చ‌లు..!

    MLC Kavitha | కాంగ్రెస్ గూటికి క‌విత చేర‌నుందా.. ఏకంగా హైక‌మండ్‌తో చ‌ర్చ‌లు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:MLC Kavitha | తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతుంది. తన లేఖ ద్వారా సంచలనంగా మారిన కవిత రాజకీయంగా కొత్త అడుగు వేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

    ఇటీవ‌ల క‌విత Kavitha కొత్త పార్టీ పెట్ట‌నుందంటూ ప్ర‌చారాలు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు క‌విత కాంగ్రెస్ గూటికి చేర‌నుందంటూ ప్రచారం న‌డుస్తుంది. ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని సంప్రదించారని తెలుస్తుంది. ఇటీవల రెండు మూడు రోజులపాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ (PCC President Mahesh Kumar Goud) ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే, కవిత ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి.

    MLC Kavitha | కొత్త అడుగులు..

    అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్‌ కుటుంబ కలహాలకు కాంగ్రెస్‌ Congress కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయని వారు భావించారట‌. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించింది. ఫలితంగా కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు కవిత(MLC Kavitha)కు ఎంట్రీ లేదనేది కొంద‌రి టాక్. ఇక కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.ఇప్పుడు సొంత బలం పెంచుకునేందుకు క‌విత సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు.

    తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై ఆమె దృష్టి సారించారు. ‘సింగరేణి జాగృతి'(Singareni Jagruti) పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. అదే విధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌(Social media influencer)తో సమావేశమవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌లో BRS తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ‘చేయి’ అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ.. ఆ తర్వాత లీకులు బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారమూ విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు.

    ఈ శీరిక్ష ఆంధ్రజ్యోతి క‌థ‌నాన్ని ఉటంకిస్తూ చెప్ప‌డం జరిగింది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...