అక్షరటుడే, వెబ్‌డెస్క్: Duvvada Srinivas | ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి హల్చల్ చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని రోడ్డుపై హంగామా చేశారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Divvela Madhuri) దంపతులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. రీల్స్, వీడియోలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. అయితే శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రోడ్డుపై హల్చల్ చస్త్రశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ ఆరోపణలు చేశారు.
Duvvada Srinivas | ఫోన్ చేసి చెప్పాడు
తనపై జరుగుతున్న కుట్ర గురించి అప్పన్న అనే వ్యక్తి తన భార్య మాధురికి ఫోన్ చేసి చెప్పాడని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నిమ్మాడలో హైవేపై వాహనం ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు. తనపై ఎవరు దాడి చేస్తారో రావాలన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కాగా తన హత్య కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ధర్మాన ప్రసాద రావు, కృష్ణదాస్‌ల అవినీతిపై ఇటీవల శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. దీంతోనే తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.
Duvvada Srinivas | స్పందించిన ధర్మాన
దువ్వాడ ఆరోపణలపై ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishnadas) శనివారం స్పందించారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడడం లేదన్నారు. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్పందిస్తున్నారని చెప్పారు. అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు నిజమేనని చెప్పారు. తనకు దువ్వాడ శ్రీనివాస్‌తో విబేధాలు లేవని చెప్పారు.